భూమి వేడిని తగ్గించాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉంది నాగూర్ వలి


ఎంబిసి ఏప్రిల్ 22 కందుకూరు రూరల్ ప్రతినిధి: గ్లోబల్ ఎక్సరేకులతో రోజురోజుకీ భూతాపం పెరిగిపోవడంతో భవిష్యత్తులో మానవ మునుగడ కష్టమైన తండంలో భూమి వేడిని తగ్గించాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందని టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగూర్ వలి అన్నారు

మంగళవారం ప్రపంచ భూ దినోత్సవ సందర్భంగా ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత ఇంకుడు గుంట్ల ఏర్పాటు మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు చేసిన తదుపరి

విద్యార్థులను ఉద్దేశించి నాగూర్ వలి మాట్లాడుతూ ప్రస్తుతం సమతుల్యత దెబ్బతిన్నని భూతాపం వలన ఉత్తర దక్షిణ ధ్రువాల్లో మంచు ఖండాలు కరిగిపోయి సముద్రాల నీటిమట్టం పెరుగుతుందని కొన్ని దీవులు కొన్ని సంవత్సరాలలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అన్నారు

ఇలాంటి తరుణంలో పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని అందుకు అందరం అడుగులు ముందుకు వేద్దామని భూమిని రక్షించుకుందాం అని పిలుపు ఇచ్చారు కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments