అల్లూరి జిల్లా కలెక్టర్ చొరవతో చిమిడిపల్లికి కొంత ఊరట


అనంతగిరి ఎంబిసి ఏప్రిల్20: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కి భీంపోలు పంచాయితీ చిమిడిపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని సరియాపల్లి బ్లాక్ గెజిట్ ఫారెస్ట్ మ్యాపునూ డీఎఫ్ఓ కార్యాలయం నుండి గ్రామస్తుల విచారణ నిమిత్తం ఫారెస్ట్ అధికారులు తీసుకురావడంతో చిమిడిపల్లి గ్రామస్తులకు కొంత ఊరట లభించింది.ఆ మ్యాప్ తీసుకురావడంతో అనంతగిరి రెవిన్యూ అధికారులకు మరియు ఆ పంచాయతీ కొంతమంది బ్రోకర్ పెద్ద మనుషులకు కళ్ళు తిరిగినట్టు అయింది.అనంతగిరి రెవెన్యూ కార్యాలయంలో చిమిడిపల్లి గ్రామానికి చెందిన రికార్డు లేకపోవడంతో రెవిన్యూ అధికారులు నోరు మెదపకుండా ఫారెస్ట్ అధికారులు తెచ్చిన మ్యాపును చూసి ఒప్పుకోక తప్పలేదు.ఆ ఊరిలో ఉన్న భూమి సతీష్ రాజుకు ఎటువంటి సంబంధం తన కొనుకొన్న భూమి నందకోట గ్రామం రెవిన్యూ పరిధిలో చూపిస్తుంది ఆ గ్రామానికి కొంత న్యాయం జరిగే విధంగా కనిపిస్తుందని సిపిఎం మండల కార్యదర్శి టోకూరు సర్పంచ్ కిల్లో మోసియా తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు జ్యేష్ఠ వెంకటరమణ,కాకర సింగులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments