జీనబడు లో పోషణ పక్వాడ వెయ్యి రోజుల కార్యక్రమం
అంగనవాడి సూపర్వైజర్ ఎస్ కే దాలింబేబీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వెయ్యి రోజుల పోషణ పక్వాడ కార్యక్రమం.
అనంతగిరి ఎంబిసి న్యూస్::అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబడు గ్రామ పంచాయతీ యందు జీనబడు సెక్టార్ స్థాయి "పోషణ పక్వాడా" కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జీనబడు గ్రామ పంచాయతీ గర్భిణీలు,బాలింతాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జీనబడుఎం పి టీ సి అలాగే జీనబడు సర్పంచ్ పాల్గొన్నారు.వారు పాల్గొని గర్భవతులు,బాలింతాలు మరియు చంటిపిల్లలకు 'వెయ్యి రోజుల సంవరక్షణ' కొరకు అనేక విషయాలు గూర్చి వివరించారు. బిడ్డ యొక్క పునాది దశ అయినా మొదటి వెయ్యి రోజుల సంవరక్షణ బాగుంటే పిల్లల భవిష్యత్ బాగుంటోందని తెలిపారు. అదేవిధంగా బాల్య వివాహాలు చేసుకోవడం మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీ వలన కలిగే అనర్థలు గురించి వివరించారు.మరియు పోషణ పక్వాడ్ కార్యక్రమానికి పాల్గొని పోషణ-ఆరోగ్యం గురించి వాటి యొక్క ఆవశ్యకతను వివరించారు.ఈ కార్యక్రమంలో సచివాలయం. ఆశవర్క్ ర్ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments