కొండిభ పంచాయతీ కప్పటివలసలో పౌష్టికహర పక్షోత్సవం

కొండిభ పంచాయతీ కప్పటివలసలో పౌష్టికహర పక్షోత్సవం.

ముఖ్య అతిధిగా పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జన్ని సింహాద్రి.


అనంతగిరి ఎంబిసి ఏప్రిల్ 17: అనంతగిరి:అనంతగిరి మండలం కొండిభ పంంచాయితీ కప్పటివలస అంగన్వాడీ కేంద్రంలో సూపెర్వైజర్ సత్యవతి ఆధ్వర్యంలో పౌష్టికాహర పక్షోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాట్లాడుతూ ఏప్రిల్ 8 నుండి 22 వరకు పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా 1000 రోజుల సంరక్షణ అనగా గర్భవతి అని నిర్దరించుకున్న మొదటి నెల నుండి పిల్లలు రెండు సంవత్సరాలు వచ్చే వరకు తీసుకోవలసిన పౌష్టికాహారం కోసం,గర్భిణి బాలింత అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల తల్లితండ్రులకు వివరించడం జరిగింది

.మూడు సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవానికి అంగన్వాడి కేంద్రంలో పంపాలని అలాగే అర్హులైన లబ్ధిదారులు పోషణ ట్రాకర్ యాప్ లో ఎలా నమోదు చేసుకోవాలో వివరించారు. గ్రామస్తుడైన అయిన యువ నాయకుడు సింహాద్రి మాట్లాడుతూ పౌష్టికాహారం అనేది గర్భిణీలకు మరియు చిన్న పిల్లలకు ఎంతో అవసరమని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కలిమ్మ, పద్మిని,మినీ అంగన్వాడీ టీచర్ అప్పలమ్మ,ఆయాలు ఆశవర్కర్ లు గ్రామస్తులు మచుబాబు,సన్యాసిరావు, అప్పన్న, దొబులు, అప్పలరాజు,రామచందర్, అంగన్వాడి పిల్లల యొక్క తల్లిదండ్రులు మరియు తదితరాలు పాల్గొన్నారు.

0 Comments