వాడివేడిగా సాగిన అల్లూరిజిల్లా పాడేరు74వ పాలకవర్గ సమావేశం..
జిఓ నెంబర్ 3 కోసం గళం విప్పిన అనంతగిరి సిపిఎం జడ్పీటీసీ దీసరి గంగరాజు
అనంతగిరి ఎంబిసి ఏప్రిల్ 21: నిన్న ప్రకటించిన మెగా డిఎస్సీ లో పాడేరు ఐటీడీఏ పరిధిలో 400 పోస్టులు ప్రకటించి గిరిజనులకు 24 పోస్టులు ప్రకటించి గిరిజనులకు తీరాని అన్యాయం చేశారు. ప్రభుత్వం జి.ఓ నెంబర్ 3 రద్దు చేసి గిరిజనులకు రావాల్సిన ఉద్యోగాలు గిరిజనేతరులకు కట్టబెడుతూ ఉన్నారు. పాలకవర్గంలో తీర్మానం చేయాలని తీర్మానం కాఫీ వేంటనే ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేయడం జరిగింది. జి.ఓ.నెంబర్ 3 నూటికి నూరు శాతం ఉద్యోగాలు.వచ్చేలా జి.ఓ.ను పునఃరుద్దరించి చట్టబద్దత కల్పించాలని మంత్రి గారికి డిమాండ్ చేయడం జరిగింది.
ఆశ్రమ పాఠశాలల్లో గత సంవత్సరం 209 మంది సి ఆర్ టీ లను సర్వీస్ రెగ్యులరైజ్ చేసారు. ఇదే అల్లూరి జిల్లాలో అన్ని అర్హతలు కలిగి ఎలక్షన్ కోడ్ పుణ్యమా అని,తదితర కోర్రిలా కారణంగా 288 మంది సి ఆర్ టీ లు మిగిలి ఉన్నారు. ఈ దగా డిస్సీ ప్రకటన తో సి ఆర్ టి ల బ్రతుకులు రోడ్డునా పడింది..కావున వీరికి తక్షణ న్యాయం చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 732 మంది సి.హెచ్.డబ్ల్యూ లకు ఆశాలుగా మార్చాలని పి.హెచ్.సి ల్లో విధులు నిర్వహిస్తున్న అంబులెన్స్ డ్రైవర్లకు ఐటిడిఎ లో కలిపి జీతాలు పెంచాలని అధనపు డ్రైవర్లు నియమించాలని పి.హెచ్.సి ల్లో గర్భిణీ స్త్రీలకు స్కెనింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని సమదృష్టికి తీసుకు వెళ్ళడంతో పై డిమాండ్స్ పరిష్కారం కోసం కృషి చేస్తానని గిరిజన సహకార సంస్థ జి.సి.సి లో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అధ్యక్షతన సబ్ కలెక్టర్ గారి ఆద్వర్యంలో జి.సి.సి లో కాంట్రాక్టు పద్ధతిలో సేల్స్ మెన్ లను భర్తీ చేశారు వారిని కాంట్రాక్టు సేల్స్ మెన్లు కాకుండా డీలార్లుగా మార్చి జీతాలు లేకుండా కమీషన్ పద్ధతిలో చాకిరీ చేయిస్తున్నారు. కమీషన్ రూపంలో ఒక్కొక్క డీలార్ కి 1000 రూపాయలు వచ్చిన పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 322 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణాలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వాలని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ టి.ఎ ని అనంతగిరి మండలం నుండి బయటకు పంపించాలని రోడ్లు పనులు జరగకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోట్లు ఖర్చు అవుతున్న గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేవు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశం లో అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్ర, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
0 Comments