కొందరు వ్యక్తులు విపరీత చేష్టలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి చేపకు బీరు తాగించాడు. ప్రజలు ఎంతో ఇష్టంగా తినే చేపల్లో రోహు చేప ఒకటి. ఇది పది కేజీలకుపైగా బరువు పెరుగుతుంది.
అయితే, ఆ వ్యక్తి భారీ రోహు చేపను ఓ చేతిలో పట్టుకుని, మరో చేతిలో బీరు సీసా ఎత్తి ఆ చేపకు తాగించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చేపకు బీరు తాగించం ఏంటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణుల పట్ల ఎవరైనా హింసకు పాల్పడితే, వారిపై పోరాటాలు చేసే పెటా (PETA)... ఈ వీడియోపై దృష్టి సారించాలని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
0 Comments