ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు.

విశాఖలో దారుణం...

ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు.


ఏపి బ్యూరో చీఫ్ ఎంబిసి: విశాఖపట్నం మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. కోస్ట్ గార్డ్ కమాండెంట్ గా పనిచేస్తున్న బల్బీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డంతో మొబైల్, లాప్టాప్ ను తల్లి అల్కా సింగ్ తీసుకుంది. లాప్టాప్, మొబైల్ తనకు ఇవ్వాలంటూ తల్లితో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో సమీపంలో ఉన్న కత్తి తీసి తల్లి అల్కా సింగ్ పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందడంతో తలుపు తాళాలు వేసి కొడుకు అక్కడి నుంచి పరారయ్యాడు. మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

0 Comments