బైకుపై ప్రియురాలితో విచిత్ర విన్యాసం.. చివరకు (VIDEO)
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకుపై ప్రియురాలిని ఎక్కించుకుని వెళ్తున్నాడు. అంత వరకూ వెనుక కూర్చున్న ప్రియురాలిని మధ్యలో బైకు ఆపి ముందు ట్యాంక్ మీద కూర్చోబెట్టుకున్నాడు.
కొంచెం దూరం వెళ్లగానే సడన్‌గా పోలీసులు బైకును ఆపేశారు. ఆమెను కిందకు దింపేసి, బైకు తాళాలు తీసుకున్నారు. అతడి వెనుకే కారులో వెళ్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
0 Comments