వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి.. షాకింగ్ వీడియో


మహారాష్ట్రలోని థానేలో కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నాలుగు కుక్కలు ఆ వృద్దురాలిపై ఒక్కసారిగా ఎగబడ్డాయి. దీంతో ఆమె కిందపడిపోయింది. కుక్కలు నలువైపులా ఎటాక్‌ చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వాటిని దూరం కొట్టి ఆ వృద్దురాలిని కాపాడారు.

0 Comments