డాక్టర్ మణి భూషణ్ "ఆర్ ఆర్ ఆర్ " లఘు చిత్రానికి హైదరాబాద్ ఉత్తమ అవార్డు ప్రధానం
ఎంబిసి ప్రతినిధి: నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన టీవీ టూరిజం ఛానల్ సమర్పణ లో , జాతీయ అవార్డు గ్రహీత , ప్రముఖ దర్శకుడు మరియు రచయత డాక్టర్ మణి భూషణ్ గారి దర్శకత్వం లో విడుదలై గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ ఉత్సవం లో ఉత్తమ అవార్డు పొందిన " ఆర్ ఆర్ ఆర్ " - పర్యావరణ చిత్రానికి తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో వి కె ఎంటర్టైన్మెంట్ సంస్థ అంగరంగ వైభవంగా జరిపిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో సినీ నటుడు , నిర్మాత మురళి మోహన్ గారి చేతులమీదుగా అవార్డు ఫంక్షన్ జరిగింది.
ఈ కార్యక్రమ లో విశాఖ నగర కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేస్తున్న డాక్టర్ మణి భూషణ్ గారి లఘు చిత్రం ఉత్తమ అవార్డు పొందింది. ఈ అవార్డును వేదికమీద డిజిటల్ వీడియోస్ అధికార ప్రతినిధి దీపికా గునుకుల అందుకున్నారు, ఈ సందర్బంగా దర్శకుడు డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఒక సంచలనం ఒకే రోజు లో ఈ చిత్రాన్ని డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేశామని , ప్రకృతి పట్ల ప్రతిఒక్కరు భాద్యత గ వ్యవహరించాలనే సందేశం తో , యువతకు కావలసిన ప్రేమ అనే కధాంశం తో ఆర్ - రెడ్యూస్ , ఆర్ - రి యూస్ , ఆర్ - రి సైకిల్ అనే త్రీ ఆర్ ప్రిన్సిపల్స్ ను ప్రజలకు అర్ధమయ్యే లా ఈ లఘు చిత్రం నిర్మించామని , రెండో అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని , మా సంస్థ ద్వార సమాజ హితానికి ఎన్నో మంచి చిత్రాలు త్వరలో అందరిని అలరిస్తాయని తెలిపారు . ఈ చిత్రం లో నటించిన హీరో గణేష్ , హీరోయిన్ ప్రణవి , మరో ముఖ్య పాత్రలో హీరో ఆదిత్యభూషణ్ , ముత్యాలరావు , సీతదేవి , మహేష్ , సత్యం నాయుడు తదితరులు నటించి ప్రజలను మెప్పించారని అందరికి అభినందనలు తెలియజెసారు . అవార్డు ఇచ్చి ప్రతిభను ప్రోత్సహిస్తున్న సంస్థ అధినేత వి కె రమేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం టీవీ టూరిజం ఛానల్ లో అందుబాటులో ఉందని , తప్పకుండ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరారు.
0 Comments