నాలుగు రోజులు భారీ వర్షాలు.. తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే APలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు.. తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. దీంతో ఉత్తర కోస్తా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారుతుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
0 Comments