గ్రౌండ్ లోకి అనుకోని అతిథి..ప్లేయర్స్ పరుగో పరుగు (వీడియో)
ఓ క్రికెట్ గ్రౌండ్లో ప్లేయర్స్ అందరూ ఆటలో లీనమై ఉన్నారు. వారి చుట్టూ వందలాది మంది ఆటను ఆస్వాదిస్తున్నారు. అయితే అంతలోనే గ్రౌండ్లోకి అనుకోని అతిథిగా ఎద్దు వచ్చింది. అది అంతటితో ఆగలేదు. ప్లేయర్ల వెంట పడింది. దాంతో ఆ ఆటగాళ్లు ఒక్కసారిగా పరుగో పరుగు అంటూ పరుగు లంకించారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటున్నారు.
0 Comments