కందుకూరు పామూరు రహదారి లో గల మీసేవ కేంద్రం నిర్వహణపై అధికారుల తనిఖీలు ఎక్కడ
ఆధార్ అనుసంధానం నావద్దలేదు నేను పట్టించుకోవటం లేదు అని నిర్వాకుని సమాధానం
అయితే మీసేవ నిర్వహణ ఎలా నిలుస్తుంది
నేను పట్టించుకోవటం లేదు అనుసంధానం చేయటం లేదు అనే సమాధానం సబబా
అధికారులే సమాధానం ఇవ్వాలి అంటున్న ప్రజలు
కందుకూరు పట్టణం ఎంబిసి ప్రతినిధి మే 9 ప్రభుత్వం మీసేవ సేవలపై అసంతృప్తితో సశివాలయాలకు కొన్ని సేవలు అందించటం సబబే అనే వాస్తవాలకు నిదర్శనంగా కందుకూరు పట్టణంలోని పామూరు రహదారిలో రిలయన్స్ మార్ట్ సమీపంలో గల మీసేవ కేంద్రం నిర్వాహకులు తన పనితీరుతో ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్న దారుణ పరిస్థితి నెలకొని ఉంది ప్రభుత్వం ఎన్ని చేసినా మీసేవ కేంద్రాలకు ఆధార్ అనుసంధానం ఇతర అంశాలను అందివ్వగా సోమవారం ఆధార అనుసంధానం కోసం వెళ్లిన ప్రజలకు ముఖ్యంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులకు తనదైన బలుపుతో శైలితో ఆధార్ అనుసంధానం నేను వదిలివేశానని నాకు అవసరం లేదని నేను ఏమి చేయలేదని ఉదయం సర్వర్ పనిచేస్తుందని అందుకే వదిలివేసానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం అతను మీ సేవతో ఆర్థికంగా బలపడటం కారణంగా లేక సామాజికంగా ఉన్న బొలుపు కారణమా అనేది ఎవరికి అంతుచిక్కని చిదంబర రహస్యంగా మారింది మరోవైపు నిరంతరం మీసేవ కేంద్రాలను తనిఖీ చేయాల్సిన రెవిన్యూ అధికారులు నిద్రపోతున్నారా లేక అతని అందజేసి భయపడుతున్నారా అనే అనుమానాలు సామాన్యుల నుండి వస్తున్నాయి ఏదేమైనా అత్యవసర సమయంలో ప్రయోజనాలు చేకూరుస్తాయని ప్రజలు అధికారులు మీసేవ కేంద్రాలకు అనుమతులు ఇచ్చిన సందర్భంలో ఇలాంటి సమాధానాలు సబబు కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదో వ్యక్తిగత అభిప్రాయాలు సామాజిక యువతతో ప్రజలను ఇబ్బంది పెడితే ఆ చిన్న సమస్య బాధపడుతున్న వారికి ఎంత నష్టం చేకూరుస్తుందో అధికారులు ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
1 Comments
సామాజిక బలుపు అంటే
ReplyDelete