- పరిశోధన లేకుండా మిడి మిడి జ్ఞానంతో విమర్శలు తగవు
- పంచాంగ కర్తలు సమన్యాయం తో ధర్మాన్ని కాపాడాలి
- తేజస్వి జ్యోతిష వాస్తు వేద పరిశోధన కేంద్రం ఉగాది, జూటూరి పంచాంగ రచనా రజితోత్సవ వేడుకలలో ప్రముఖ పంచాంగ కర్తల పిలుపు.
ఒంగోలు ఎంబిసి: సనాతన వైదిక ధర్మం,భారతీయ సంస్క్రుతి సంప్రదాయాలను పరిరక్షించు కుంటూ సంస్కృతంపై అధ్యయనం అవగాహన పెంచు కోవాలని పంచాంగ పునర్ వైభవం సాధించేందుకు పరిశోధన లు చెయ్యాలని ప్రముఖ పంచాంగ కర్తలు పిలుపు ఇచ్చారు. ఆదివారం ఒంగోలు నగరంలోని సంతపేట సాయిబాబా మందిరం లో డా.జూటూరి భానుమూర్తి ఆధ్వర్యంలో తేజస్వి జ్యోతిష వాస్తు వేద పరిశోధన కేంద్రం పంచాంగ రజతోత్సవ వేడుకలు, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో రెండు తెలుగు రాష్ట్రాల పంచాంగ కర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పంచాంగ కర్త పండిత బట్టే వీరభద్ర దైవజ్ఞ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పంచాంగ కర్తలు మాట్లాడుతూ రాను రాను పంచాంగ కర్తలు పెరిగి పోతున్నారని, కానీ పంచాంగం వైశిష్ట్యం వారం, తిథి, నక్షత్రం ప్రధానంగా శాస్త్రం పై అధ్యయనం అవగాహన కలిగివుండాలని యువ పంచాంగ కర్త లకు హితవు చెప్పారు. పంచాంగకర్తల లో వైరుధ్యాలు చోటు చేసుకుంటున్న కారణంగా వివాదాలు తలెత్తు తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. పంచాంగం పైవచ్చే విమర్శలు, వివాదాల నివృత్తికి ప్రాథమిక స్థాయి నుండి సంస్కృతం, పంచాంగం, తిథి వారం నక్షత్ర శాస్త్రం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామ స్థాయిలో అర్చకులు, పౌరోహితులు, యాగ్నీకులు సనాతన వైదిక ధర్మాన్ని పరిరక్షణకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.ఈ సందర్భంగా రెండున్నర దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో సనాతన ధర్మం కాపాడేందుకు పంచాంగ రచన చేస్తూ పునర్ వైభవానికి కృషి చేస్తున్న డా. జూటూరి భానుమూర్తి సేవలను పంచాంగ కర్తలు కొనియాడారు. ఈకార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పంచాంగ కర్తలు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ, చింతా గోపి శర్మ, డా.నీలం పూర్ణ మోహన్, దేవరభొట్ల భవాని శర్మ, శిష్ట సూర్యనారాయణ, ఇంద్రగంటి సాయినాధ శర్మ, డి.వి. సాయినాధ్ శర్మ, విరివించి ఫణి శశాంక్ శర్మ, లంకా శ్యామ సుందరం, డా.పెట్లూరి వెంకటేశ్వర రావు, డా. ముదివర్తి పవన్ కుమార్, డా. లంకా ప్రసన్న కుమార్, ములుకుట్ల శ్రీరామమూర్తి, సముద్రాల రామ్మోహన్, కంచిభొట్ల బాలాజీ, హిమకర్ శర్మ, ఓరుగంటి షణ్ముఖ, రెంటచింతల హరి, చివుకుల శ్రీకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువ పంచాంగ కర్తలను ఉగాది పురస్కారాలతో సత్కరించారు.
0 Comments