కొల్లూరుపాడు లో వైసీపీ ప్రచారం
ఉలవపాడు ఎంబిసి ప్రతినిధి మార్చి 7 తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆదేశాలతో ఉలవపాడు మండలం కొల్లూరుపాడు గ్రామం ఎస్సీ కాలనీ బీసీ కాలనీ నందు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఆప్యాయతతో మాట్లాడుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ సిపి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఉలవపాడు మండల JCS కన్వీనర్ వెలిచెర్ల ధనకోటి , వైస్ ఎంపీపీ దాసరి రమణయ్య , ఎంపీటీసీ వాకా రాధామాధవి , మాజీ ఏఎంసి డైరెక్టర్ మల్లవరపు సుబ్బారెడ్డి , HDC నెంబర్ అమ్మనబోలు బ్రహ్మయ్య , సచివాలయ కన్వీనర్లు భీమయ్య , శ్రీమన్నారాయణ , దాసరి రాము మహిళా కన్వీనర్ ఎద్దు ఆదిలక్ష్మి , మండల వైయస్సార్ సిపి నాయకులు చీమకుర్తి కృష్ణారెడ్డి , నన్నం పోతురాజు , వీర రాఘవరెడ్డి , ప్రభాకర్ రెడ్డి వార్డు మెంబర్ వేమూరి వెంకటేశ్వర్లు , గోసుల రాజశేఖర్ రెడ్డి , శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు
0 Comments