- విజయనగరం 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు
విజయనగరం జిల్లా ఎంబిసి: తే 23-03-2023 ది రాత్రి బాలాజీ మార్కెట్ షాపు నంబరు 304 యజమాని అరుణ్ కుమార్ అగర్వాల్ మూసివేసి ఇంటికి వెళ్లిపోగా, ఎవరో గుర్తు తెలియని దొంగలు మారు తాళంతో షాపు షట్టరు తలుపు తీసి, లోపలకు ప్రవేశించి, దఫ దఫాలుగా సుమారు రూ.1.90 లక్షల విలువైన బట్టల మూటలు దొంగిలించి పారిపోయినట్లుగా 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
దొంగతనంకు పాల్పడిన వ్యక్తులుగా బోండపల్లి మండలం జియ్యన్నవలసకు చెందిన (1) చుక్క (2) పడాల శంకర్ (3) ఎర్ర శ్రీను (4) పట్నాల అప్పల నాయుడు లను 1వ పట్టణ పోలీసులు గుర్తించి, వారి వద్ద నుండి రూ.75 వేలు నగదు, 10 నైటీ మూటలను రికవరీ చేసి, నిందితులు నలుగురిని రిమాండుకు తరలించినట్లుగా 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు తెలిపారు. 1వ పట్టణ ఎస్ఐలు అశోక్ కుమార్, భాస్కరరావు, హెచ్.సి. అచ్చీరాజు మరియు సిబ్బంది క్రియాశీలకంగా పని చేశారని సిఐ తెలిపారు.
0 Comments