ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబిరా బేగం


విశాఖపట్నం ఎంబిసి: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబిరా బేగం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ…తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శోభయమానంగ విరిజిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని, రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. ఈ  కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని సభిరా బేగం కోరుకున్నారు.

0 Comments