గిరిజ పనితీరు బేష్..
పొన్నలూరు ఎంబిసి మార్చి2: మండల పరిధిలోని సింగర బొట్ల పాలెం గ్రామ సచివాలయాన్ని ఎస్ఐ దాసరి రాజారావు గురువారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ మహిళా పోలీసు గా విధులు నిర్వహిస్తున్న గుండ్ల గిరిజ పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సoదర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజ గ్రామస్థులతో మాట్లాడి సచివాలయం పరిధిలోని 3 గ్రామాలలో దాతల సహకారంతో 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివలన వివిధ రకాల నేరాలు జరగాకుండా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో ప్రోత్సహించిన ఎస్ఐ దాసరి రాజారావు కి, సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన గ్రామస్థులకు, తోటి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
0 Comments