- ఎల్.కోట ఎస్ఐ ఎం.ముకుందారావు
విజయనగరం జిల్లా ఎంబిసి: ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో పోతంపేట గ్రామంలో 2016 సంవత్సరంలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి బి. సాయి కళ్యాణ చక్రవర్తి జనవరి 31న తీర్పు వెల్లడించినట్లుగా ఎల్.కోట ఎస్ఐ ఎం. ముకుందరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం, పోతంపేట గ్రామంలో నివాసం ఉంటున్న చంద్రపు గౌరి నాయుడుకి అదే గ్రామానికి చెందిన కోరుకొండ అప్పలపాత్రుడు అలియాస్ రాజు అనే వ్యక్తికి మధ్య పాత కక్షలు కారణంగా ఇరువురు గొడపడగా కోరుకొండ అప్పలపాత్రుడు అనే వ్యక్తి చంద్రపు గౌరినాయుడు యొక్క తలపై కర్రతో కొట్టగా అతను మృతి చెందాడు.ఈ విషయమై ఎల్.కోట పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాది మేరకు అప్పటి ఎల్.కోట ఎస్.ఐ. ఎం.శ్రీనివాసరావు కేసు నమోదు చేయగా, అప్పటి ఎస్.కోట సిఐ జి.సంజీవరావు దర్యాప్తు చేపట్టి, నేర స్థలం పరిశీలన, నిందుతుడిని అరెస్టు చేయగా, తరువాత ఎస్.కోట సిఐగా బాధ్యతలు చేపట్టిన బి.రమణమూర్తి నిందితుడిపై కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేసారు. కోర్టు విచారణలో నిందితుడు కోరుకొండ అప్పలపాత్రుడు అలియాస్ రాజుపై నేరారోపణలు రుజువు కావడంతో నిందితునికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి బి. సాయి కళ్యాణ చక్రవర్తి జీవిత ఖైదు మరియు రూ. 1000/-ల జరిమానా విధించారు. ఈ కేసులో పోలీసుల తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. రఘురాం వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబులు బి. శ్రీనివాసరావు కోర్టులో సాక్యులను సకాలంలో హాజరపర్చి, ప్రాసిక్యూషన్ త్వరితగతిన అయ్యే విధంగా సహకారాన్ని అందించినట్లుగా ఎల్.కోట ఎస్ఐ ఎం. ముకుందరావు తెలిపారు.
0 Comments