- విజయనగరం 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు
విజయనగరం జిల్లా ఎంబిసి: పట్టణ బాలాజీ జంక్షన్ వద్ద జనవరి 21న రాత్రి 1.30 గంటల సమయంలో కొత్తపేటకు చెందిన రెడ్డి సన్యాసిరావును ముగ్గురు నిందితులు కత్తులతో బెదిరించి, అతని వద్ద నుండి సెల్ ఫోను లాక్కెళ్ళినట్లుగా 1వ పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడు అయిన విజయనగరం మంగలవీధికి చెందిన షేక్ హుస్సేన్ మరియు మరో ఇద్దరు జువినల్స్ స్కూటీ పై జనవరి 27న స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద అనుమానాస్పదం గా తిరుగుతుండగా అక్కడ వాహన తనిఖీలు చేపడుతున్న 1వ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, విచారణ చెయ్యగా, నిదితులు జనవరి 21న పాల్పడిన నేరాన్ని అంగీకరించారు. నిందితుడు వద్ద నుండి ఒక సెల్ ఫోను, రెండు కత్తులు, స్కుతీని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండుకు తరలించినట్లు గా 1వ పట్టణ సిఐ బి.వెంకటరావు తెలిపారు. ఎస్ఐ వి.అశోక్ కుమార్, HC ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు దర్యాప్తులో సహకరించారు.
0 Comments