రాష్ట్రస్థాయి జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి


నెల్లూరు MBC ప్రతినిధి నవంబర్ 29 నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్రస్థాయి జగనన్న క్రీడా సంబరాల్లో భాగంగా  జిల్లాస్థాయి క్రీడా పోటీలను  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు వైసిపి ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని ఆరోగ్యం, నడవడికతో మాత్రమే ఎవరికైనా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని, ఐశ్వర్యంతో కాదని, ఈ విషయాన్ని గుర్తించాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, విద్యార్థి క్రీడలపట్ల ఆసక్తి చూపేలా వారిని ప్రోత్సహించాలని అదే అందరి బాధ్యత కావాలని మంత్రి కాకాని* అన్నారు రాష్ట్రస్థాయి సీఎం కప్-2022 పోటీల్లో సత్తా చాటి జిల్లా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని   కాకాణి, పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ రోనంకి కుర్మానాధ్ తదితరులు పాల్గొన్నారు

0 Comments