అక్రమ నిర్మాణాల గురించి కలెక్టర్ కు ఫిర్యాదు
కందుకూరు MBC నవంబర్ 7: పోస్టాఫీస్ సెంటర్ లో బి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం వద్ద అక్రమ నిర్మాణాల వ్యవహారంపై సబ్ కలెక్టర్ శోభికకు ఫిర్యాదు చేసిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు అనుమతి లేని నిర్మాణంపై రెండు రోజుల మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అప్పటినుంచి రాత్రి పగలు పనులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిర్మాణం వలన పోస్టాఫీస్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వివరించారు. వెంటనే పనులు నిలిపివేయాలని కోరగా, వెంటనే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
0 Comments