ఢిల్లీలో ఘటన..
ముంబయికి చెందిన శ్రద్ధ, ఆఫ్తాబ్ ప్రేమికులు..
పెద్దలు అంగీకరించకపోవడంతో ఢిల్లీ వచ్చిన వైనం..
దేశ రాజధానిలో సహజీవనం..
ఇరువురి మధ్య తరచుగా ఘర్షణలు..
ముంబయికి చెందిన శ్రద్ధ, ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ప్రేమికులు. శ్రద్ధ ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తోంది. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఢిల్లీ వచ్చి సహజీవనం చేస్తున్నారు. అయితే, శ్రద్ధ పెళ్లి చేసుకోవాలని ఆఫ్తాబ్ పై ఒత్తిడి తెచ్చేది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఓ రోజు ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఆఫ్తాబ్... శ్రద్ధను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆనవాలు లేకుండా చేయాలని భావించి 35 ముక్కలుగా చేశాడు. వాటిని ఫ్రిజ్ లో పెట్టి, ప్రతి రోజూ అర్ధరాత్రి వేళ కొన్ని ముక్కలను తీసుకుని ఢిల్లీ వీధుల్లో పారేసి వచ్చేవాడు. ఈ విధంగా 18 రోజుల పాటు చేశాడు. అయితే, శ్రద్ధ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆఫ్తాబ్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధకు ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆమె తండ్రి ఢిల్లీ వచ్చారు. ఫ్లాట్ కు తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆఫ్తాబ్ ను అరెస్ట్ చేయడంతో, హత్య, ఆ హత్యను రూపుమాపేందుకు మృతదేహం భాగాలను ఢిల్లీ వీధుల్లో విసిరివేయడం మొత్తం వెల్లడైంది.
1 Comments
Urgent ga veedini uri teyandi. Veedu manishi tolu kappukunna mrugam.
ReplyDelete