క్రీడాకారుల నుంచి భారీ స్పందన .
వేదిక : A.B.M డీగ్రీ కాలేజీలో ఎంపిక ప్రక్రియ .
ఉత్తమ ప్రతిభ కలిగిన 32 ఎంపిక
తేదీ నవంబర్ 27 2022 ఆదివారం ఉదయం 10 గంటలకు అండర్ 14 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక జరిగింది విశేష స్పందన లభించింది . ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ PDCA జిల్లా అధ్యక్షుడు నాగిశెట్టి మోహన్ దాస్ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందిని కరోనా కష్టకాలంలో క్రీడలకు విరామం ప్రకటించడం జరిగిందని ప్రస్తుతం కరోనా తగ్గడం దేశవ్యాప్తంగా క్రీడలను అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఒంగోలులో జిల్లా స్ధాయి అండర్ 14 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక ను నిర్వహించామని ఈ అండర్ 14 వయస్సు మొదటి తొలిమెట్టు అని రాష్ట్ర ,జాతీయ అంతర్జాతీయ స్ధాయి క్రికెట్ ఆడడానికి అని ఈ ఎంపికకు విశేష స్పందన వలన 116 మంది క్రీడాకారులు పాల్గొన్నరని PDCA అధ్యక్షుడు Nమోహన్ దాస్ తెలిపారు .కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు మొదటి విడతగా 46 మంది క్రికెట్ క్రీడాకారులను ఎంపిక చేసి అనంతరం మరల 46 మంది క్రీడాకారులకు మరల సెలక్షన్ నిర్వహించడం జరిగింది అందులో 32 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది అని వచ్చే శనివారం ,ఆదివారాలు కోరిశపాడు మండలం రావినూతల క్రికెట్ గ్రౌండ్ లో లీక్ మ్యాచ్ లు నిర్వహించి ఉత్తమ ప్రకాశం క్రికెట్ జట్టు 16 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుంది అని కారుశాల నాగేశ్వరరావు ప్రకటించారు . జిల్లా జాయింట్ సెక్రటరీ కొల్లా మధు మాట్లాడుతూ రాబోయే కాలంలో క్రీడాకారులకు సౌకర్యాలు కల్పన ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు . ఈ ఎంపిక ప్రక్రియను న్యాయ నిర్ణేతలుగా పి.శ్రీను , భూవన , వాసు వ్యావహరించారు . ఈ కార్యక్రమంలో ట్రెజరర్ SK. అనిల్ , అసోసియేషన్ నంబర్స్ హనుమంతరావు , నవీన్ B.శ్రీను B.కమల్ , సాయికృష్టా , సినియార్ కోచ్ సుధాకర్ , ఫిజియో ధెరిపి డాక్టర్ ఆంజనీయ కుమార్ పాల్గొన్నారు .
0 Comments