రచ్చ బండ తరహా లో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం పై చేపట్టిన విచారణ ...

ఫిర్యాదు దారులు గైర్  హాజరు..

ఆరోపణలు ఎదర్కొంటున్న క్షేత్ర సహాయకురాలి కి గ్రామం మూకుమ్మడి మద్దతు..

సంబంధం లేని వ్యవహారం పై విచారణ ఏమిటి అని ప్రశ్నించిన ఉపాధి కూలీలు,రాజకీయ పార్టీ నాయకులు..

తోక ముడిచిన ఫిర్యాదు దారుల పై విచారణ అధికారి అసహనం...


సింగరాయకొండ MBC ప్రతినిధి అక్టోబర్ 21 రచ్చబండ తరహా లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెలుగు ఎ పిడి జి. కాత్యాయిని శుక్రవారం సింగరాయకొండ మండలం బింగిన పల్లి గ్రామ సర్పంచ్ సమక్షం లో గ్రామ పంచాయితీ కార్యాలయం లో చేపట్టిన ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం పై విచారణ చేపట్టారు. కరువు కాటకాలతో తల్ల ఢిల్లీ పోతున్న పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీ ఉపాధి హామీ పథకం చేపట్టి కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేస్తుంది. ఆని ధులను యదేచ్చగా  క్షేత్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు  దోచుకుంటున్నారు  దాని పై విచారణ జరపాలి ఉపాధి హామీ పథకంలో ఉపాధి కూలీలకు చెందాల్సిన ప్రతి పైసా చేరాలని మధ్యలో వారు దోచుకోవడం దారుణం అని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యన్నా బత్తిన అరుణ కుమారి సింగరాయకొండ మండల పరిషత్ సాధారణ సమావేశం దృష్టి కి తెచ్చారు. దాన్ని సమర్థించింది ఉపాధి హామీ పథకం  పర్యవేక్షణ అధికారుల కు సంబంధించి అరుణ కుమారి ఆరోపణ లకు మండల వైస్ చైర్మన్ సామంతుల రవికుమార్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉండగా మండల పరిషత్ సాధారణ సమావేశం లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ప్రస్తావించిన సమస్య పై సింగరాయకొండ మండలం బింగినపల్లి  గ్రామంలో ఉపాధి హామీ పథకం లో పని చేస్తున్న క్షేత్ర సహాయకురాలు శ్రీమతి ఎద్దు  పద్మజ పై గ్రామస్తులు అక్టోబర్ 10న జిల్లా కలెక్టర్ నిర్వహించే స్పందన లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీని పై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపి తగిన రిపోర్ట్ సమర్పించాలని వెలుగు అధికారిని ఆదేశించారు. ఆ మేరకు  స్పందన 63847/2022,పిఆర్ ఎ 2022/ 012718  కింద  ఫిర్యాదును నమోదు చేసి దాని పై విచారణ కి. ఆదేశించడంతో వెలుగు ఎ పి డి జి .కాత్యాయిని శుక్రవారం విచారణ చేపట్టారు. సింగరాయకొండ మండలం బింగిన పల్లి  గ్రామ పంచాయితీ కార్యాలయంలో రచ్చబండ తరహాలో బహిరంగ విచారణ చేపట్టారు. విచారణ సమయం లో ఫిర్యాదు చేసిన వారు ఎవరు విచారణ కి హాజరు కాలేదు. క్షేత్ర సజాయకురాలి పై వచ్చిన ఆరోపణ లను గురించి  విచారణ అధికారి చదివి వినిపించారు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, ఉపాధి హామీ పథకం కూలీలు, గ్రామ వివిధ పక్షాల నాయకులు ప్రజలు మూకుమ్మడిగా విచారణ చేసే గ్రామ పంచాయితీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రచ్చబండ తరహాలో చేపట్టిన విచారణ కి కారణాలు, ఆరోపణలకు సమాధానాలు అడిగి తెలుసున్నారు. విచారణ సందర్భంగా  విచారణ అధికారి కాత్యాయిని ముందుగా స్థానికంగా ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనుల లో ఉపాధి కూలీలకు చెందాల్సిన కూలీ డబ్బులు దోచుకుంటున్నారని  కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదు ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధి హామీ పథకం  క్షేత్ర సహయకురాలు  శ్రీమతి ఎద్దు పద్మజ ని వివరణ కోరారు. అదే సమయంలో గ్రామ పంచాయితీ పరిధిలో ఉండే గ్రామ ప్రజలు మూకుమ్మడిగా గ్రామ పంచాయితీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పార్టీ లు, కులాలు, మతాలకు అతీతంగా ఒక్క తాటి పైకి వచ్చిన ఉపాధి కూలీలు, మేట్ లు, రాజకీయ పార్టీ ల నాయకులు విచారణ అధికారి ఎదుట కి చేరి వాస్తవ పరిస్థితిని వివరించారు. క్షేత్ర సహాయానికి కేవలం ఉపాధి కూలీల చేత పనిచేయించే భాధ్యత మాత్రమే ఉంటుందని ఉపాధి కూలీల పని కి సంబంధించిన విషయాలకు ఎటువంటి  సంబంధం ఉండదని ఏవిధంగా ఫిర్యాదు చేస్తారని ప్రజలు విచారణ అధికారి ని ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం గిట్టని వారు పెత్తనం కోసం ఆరాటం ఉండే వారు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేయడం అమానుషం అన్నారు. నిజంగా అవినీతి అక్రమాలు, ఉపాధి కూలీల కు చేరాల్సిన కూలీ డబ్బు దోపిడీ జరిగితే ఎక్కడ,ఎవరి ద్వారా,ఏవిధంగా, జరుగుతాయి విచారించి ఉపాధి కూలీలకు దోచుకునే వారి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. వారం వారం జరిగే కూలీ చెల్లింపుల సందర్భంలో వారానికి  ఒక్కొక్కరు  వంద రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, ఉపాధి పనులకు రాక పోయినా వారికి  మాస్టర్ వేసి వారి నుండి డబ్బు దోచుకోవడం, తక్కువ పని చేస్తే ఎక్కువ పని చేసినట్లు బిల్లులు చేయడం వంటి వాటికి సంబంధించి బాధ్యులు ఎవరు అనేది తేల్చాలని ప్రజలు, ఉపాధి కూలీలు విచారణ అధికారి ని  కోరారు.  విధి నిర్వహణ లో  తన కు సంబంధం లేని ఆపరిధి కాని క్షేత్ర స్థాయి వ్యక్తి ని కేంద్రంగా చేసి చేసిన తప్పుడు ఆరోపణలు ఫిర్యాదుల పై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని ,కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విచారణ అధికారి ని కోరారు. విచారణ సందర్భంగా గ్రామ పంచాయితీ సర్పంచ్ జెట్టి విజయ లక్ష్మి,వై సి పి నాయకులు జెట్టి శంకర రెడ్డి, నూకసాని బాల మురళీ కృష్ణ,నూకసాని పెద వెంకటేశ్వర్లు, కసుకుర్తి  కోటేశ్వరరావు, సన్నే బోయిన మాలకొండయ్య, వివిధ రాజకీయ పార్టీ ల  స్థానిక నాయకులు, ఉపాధి హామీ  కూలీలు, మేట్ లు పాల్గొన్నారు.

0 Comments