నేరస్థుల ఆచూకీ తెలపండి - నగదు బహుమతి పొందండి

- విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐ.పి.ఎస్.,


విజయనగరం జిల్లా MBC: పట్టణంలో మహారాష్ట్రకు చెందిన నేరస్థులుగా భావిస్తున్న ప్రకాష్ నగేష్ మరియు కొంతమంది వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి జిల్లాలో సంచరిస్తున్నట్లుగా జిల్లా పోలీసుశాఖకు సమాచారం అందినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక సెప్టెంబరు 19న తెలిపారు.

ఈ నేరస్థుల ఆచూకీ కనిపెట్టి, అదుపులోకి తీసుకొనేందుకు జిల్లా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసామన్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా నిందితుల ఫోటోను వెల్లడిస్తున్నామన్నారు.

ఈ ఫోటోలోగల నేరస్థులు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, రెక్కీలు నిర్వహించి, నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. కావున, ఫోటోలో ఉన్న నేరస్థుల ఆచూకీ లభిస్తే, వెంటనే సమాచారంను విజయనగరం రూరల్ సిఐ ఫోను నంబరు 9121109427 కు తెలియజేయాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు.

సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేస్తామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఒక ప్రకటనలో తెలిపారు.

0 Comments