వ్యభిచార గృహంపై పోలీసులు దాడి...


యడ్లపాడు MBC; గ్రామంలోని బీసీ కాలనీలో ఆదివారం రాత్రి వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకురాళ్లతోపాటు ఇద్దరు విటుల పై కేసు నమోదు చేశారు. యడ్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. యడ్లపాడు బీసీ కాలనీలో కొద్దికాలం కిందట షబానా అనే మహిళ అద్దెకు ఇంటిని తీసుకుంది.ఆ ఇంట్లో తరచూ కొత్త వ్యక్తులు రాకపోకలు సాగించటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఈ విషయం కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం రాత్రి పోలీసులు సదరు గృహంపై దాడి చేశారు.ఈ దాడిలో ఇద్దరు మహిళలు మరో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. నిర్వాహకురాళ్లతో పాటు ఇద్దరు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పైడి రాంబాబు తెలిపారు...!!

0 Comments