పోయిన వస్తువులు, నగదును అప్పగించి నందుక పోలీసులకు కృతజ్ఞతలు


విజయనగరం జిల్లా MBC; శ్రీకాకుళం పట్టణానికి చెందిన యలమంచిలి వెంకటలక్ష్మి అనే మహిళ తన సోదరుని ఇంటికి విజయనగరం వచ్చి, ఆగస్టు 11న తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం వెళ్లేందుకు ఆర్టీసి బస్సు ఎక్కి, రద్దీ కారణంగా చేతిలో గల సంచిని  బస్సు విడిచి పెట్టీ, బస్సు దిగిపోయింది. తరువాత కొంత సేపటికి విషయాన్ని గుర్తించి, 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, 1వ పట్టణ సిఐ శ్రీ బి.వెంకటరావు తక్షణమే స్పందించి, సీసి ఫుటేజులను ఎస్ఐ అశోక్ మరియు సిబ్బంది సహకారంతో పరిశీలించి, బ్యాగును, బ్యాగులో గల రూ.16,500/- ల నగదు, రెండున్నర తులాల బంగారు ఆభరణాలను ఫిర్యాదికి అప్పగించారు. సదరు మహిళ తన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, పోయిన వస్తువులు, నగదును అప్పగించి నందుకు 1వ పట్టణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments