మద్యం, నాటుసారా అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై దాడులు


విజయనగరం జిల్లా MBC; విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్  పర్యవేక్షణ లో ఆగస్టు 12న జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్డు ప్రమాదాలు, జూదం, కోడి, గొర్రె పందాలు నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత ఖైనీ, గుట్కాలు, గంజాయి, ఇసుక, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టారు.

మద్యం, నాటుసారా అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు, SEB వారు దాడులు నిర్వహించి, 3 కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేసి, 8.28 లీటర్ల IMFL మద్యం స్వాధీనం చేసుకున్నారు.

రామభద్రపురం PS పరిధిలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒకరిని అరెస్టు చేసి, ఒక మోటారు సైకిలు, 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

డెంకాడ పీఎస్ పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 4.5 టన్నుల ఇసుక, ఒక ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై  38 కేసులను పోలీసులు నమోదు చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 28 కేసులను పోలీసులు నమోదు చేశారు.

హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించకుండా వాహనాలు నడిపిన వారిపైనా, వాహనాలను అతి వేగంగా నడిపిన వారిపైన, ఎం.వి. నిబంధనలను అతిక్రమించిన వారిపై 725 కేసులను నమోదు చేసి, రూ. 1,75,075/- లను ఈ-చలానగా విధించారు.

దిశా 🆘యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దిశా రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టి, 516 మందితో  దిశా 🆘 యాప్ ను స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేయించి, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు. వీటితో దిశా 🆘 యాప్ ఇంత వరకు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 7,08,738 కు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 3,80,167 కు చేరింది. జిల్లా వ్యాప్తంగా మహిళపై దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న 485 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, వాటిపై నిఘా ఏర్పాటు చేసి, ఆయా ప్రాంతాల్లో దిశా మొబైల్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేశారు.

రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహన తనిఖీలు చేపట్టి, వాహన డ్రైవర్లుకు మత్తు వదిలించేందుకు వివిధ పీఎస్ పరిధిలో పోలీసు అధికారులు,  సిబ్బంది ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, రహదారి భద్రతా నిబంధనల పట్ల అవగాహన కల్పించారు.

జిల్లాలో బస్టాండులు, రైల్వే స్టేషన్లు, దాబాళ్లో మరియు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న, లాడ్జిలలో బస చేసిన అనుమానిత వ్యక్తుల వేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేపట్టారు.


ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను, చోరీ సొత్తును కొనుగోలు చేసిన మరో వ్యక్తిని CCS పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 8.5 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరాలు, ఒక మోటారు సైకిలు ను స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం ఇన్ ఛార్జ్ డిఎస్పీ శ్రీ ఆర్.శ్రీనివాసరావు గారు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, IPS గారు అభినందించారు. 

0 Comments