ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరిన జిల్లా ఎస్పీ
మోసగాళ్ళ సమాచారాన్ని డయల్ 100, వాట్సాప్ నంబరు 9392903402కు అందించాలని విజ్ఞప్తి చేసిన జిల్లా ఎస్పీ
విజయనగరం జిల్లా MBC; ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేసే మోసగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆశావహులను,నిరుద్యోగులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆగస్టు 25, గురువారం నాడు కోరారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు,పోలీసుశాఖలో హెూంగార్డు ఉద్యోగాలు కల్పిస్తామని కొంతమంది వ్యక్తులు నిరుద్యోగులను మోసగిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. నిరుద్యోగులు, ఆశావహుల ఆర్ధిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారి సమాచారాన్ని సేకరించి, వారికి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, పోలీసుశాఖలో హెూంగార్డులుగా నియమిస్తామని, నమ్మించి, వారి నుండి డబ్బుల వసూళ్ళుకు పాల్పడే మోసగాళ్ళు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ప్రభుత్వం నియమాకాలు చేపట్టదన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. ఉద్యోగ నియమకాలు ఎప్పుడు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయని, ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా పోలీసుశాఖలోను మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లోను ఉద్యోగ నియమకాలు జరగవన్నారు. కావున, ఇటువంటి మోసాలకు పాల్పడే వారి పట్ల, ప్రభుత్వ ఉద్యోగాలు, హెూంగార్డులుగా నియమిస్తామని, నిరుద్యోగుల బలహీనలతను ఆసరాగా చేసుకొని, నమ్మించి, డబ్బులు వసూలు చేసి, మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసుశాఖ ఇప్పటికే ఇటువంటి వ్యక్తుల పట్ల నిఘా ఏర్పాటు చేసిందన్నారు. మోసాలకు పాల్పడే వ్యక్తుల గురించిన సమాచారం లభిస్తే వెంటనే డయల్ 100, పోలీసు వాట్సాప్ ఫిర్యాదులు నంబరు 9392903402 కు తెలపాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యం ఉంచుతామన్నారు. మోసాలకు పాల్పడే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక హెచ్చరించారు.
0 Comments