కామన్‌వెల్త్ గేమ్స్ లో భారత్ బోణీ..తొలి పతకం సాధించిన సంకేత్ సాగర్,


బర్మింగ్ హోమ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో రోజు భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీపడిన సంకేత్ సాగర్ భారత్ కి సిల్వర్ మెడల్ ను అందించారు. సంకేత్ సాగర్ ఫస్ట్ క్లీన్ అండ్ జర్క్‌లో ప్రయత్నంలో 135 కేజీల బరువుని ఎత్తి పతక రేసులో నిలిచాడు. అయితే రెండో ప్రయత్నంలో 139 కేజీలు ఎత్తే సమయంలో అతను గాయపడ్డారు. దీంతో రెండో రౌండ్ లో విఫలమయ్యాడు. గాయం కారణంగా సంకేత్ మూడో పోటీలో పాల్గొనడని అందరూ భావించారు. కానీ మూడో ప్రయత్నంలో గాయంతో బాధపడుతూనే ట్రై చేశాడు. కానీ మోచేతికి గాయం నొప్పిని తాళలేక విఫలమయ్యాడు. 248 కేజీలతో రెండో స్థానంలో నిలి రజత పతకం తో సరిపెట్టాడు. మలేషియాకు చెందిన మహమ్మద్ అనిల్ మొత్తం 249 కేజీలు ఎత్తి స్వల్ప తేడాతో సంకేత్ ను అధిగమించాడు. దీంతో అతన్ని స్వర్ణ పతకం వరించింది. ఇదిలాఉంటే ఈ ఏడాది కామన్‌వెల్త్ పోటీల్లో భారత్‌ దక్కించుకున్న తొలి మెడల్ సంకేత్ దే కావడం గమనార్హం. 

0 Comments