ఉత్తరప్రదేశ్ ఎంబీసీ: తన ప్రియురాలి (girl friend) కోసం ఓ యువతి లింగమార్పిడి చేయించుకున్న అరుదైన ఘటన యూపీలో సంచలనం రేపింది.తోటి స్నేహితురాలైన యువతితో ప్రేమలో పడిన మరో యువతి ఆమెతో కలిసి కాపురం చేసేందుకు వీలుగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ నగరంలో సోమవారం వెలుగుచూసింది. ప్రయాగరాజ్ నగరానికి చెందిన ఇద్దరు యువతులు లెస్బియన్లు. వారు కలిసి జీవితం గడుపుదామని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారి సంబంధాన్ని రెండు కుటుంబాలు అంగీకరించక పోవడంతో వారిలో ఓ మహిళ తన లింగాన్ని మార్చుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
0 Comments