గుడ్లూరు మండల మోచెర్ల పంచాయతీ నందు తెట్టు గ్రామానికి చెందిన షేక్. రఫి తనతో పాటు 10 కుటుంబాలతో టీడీపీ లో చేరి స్థానిక నాయకులు, స్థానిక శాసన సభ్యులు ఇబ్బంది వల్ల రఫీ గా టిడిపి లో చేరడానికి ముఖ్య కారణం అని . ఇది పూర్తిగా అవాస్తవం. అని వైసీపీ మండల అధికార ప్రతినిధి సబ్బెళ్ళ రమణయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యులు అయిన మానుగుంట. మహీధర్ రెడ్డి మోచెర్ల పంచాయతి లోని ప్రతి నాయకుడిని, కార్యకర్తను సమానంగా చూస్తారు.అలాగే మొచర్ల పంచాయతి నందు అభివృధి పనులు మరియు రాష్ట్ర సీఎం గారు అయిన జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తెట్టు, మోచర్ల గ్రామ లలో ఉన్న ప్రతీ కుటుంబానికి చేరే విధంగా కృషి చేసినారు. షేక్. రఫీ మొన్న జరిగిన మొచర్ల పంచాయతి ఎన్నికల లో తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్దిని గెలిపించుటకు కాలికి బలపం కట్టుకుని వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఒడించుటకు తన సాయశక్తుల కృషి చేసినారు. కానీ ఆ ఎన్నికలలో మానుగుంట. మహీధర్ రెడ్డి గారు మా గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు వలన మా పంచాయతి ఎన్నికలలో వైసిపి పార్టీ బలపరిచిన అభ్యర్థి 1500 ఓట్లు పోలైతే 750 ఓట్లతో గెలిచినారు. అందువలన షేక్.రఫీ లాంటి నాయకులు తన స్వార్థ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ లోకి చేరినారు. అతను టిడిపి లోకి చేరటం వల్ల తెట్టు, మోచేర్ల గ్రామాల్లో వైసీపీ కేడర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మా వైసీపీ కేడర్ బలపడుతుంది.
1 Comments
అంతేలే..... పార్టీ నుండి అసలైన , వైఎస్ఆర్సీపీ జండా ను ఆదినుండి భుజాన మోసిన వాళ్ళు పార్టీ నుండి పోగపెట్టి వెళ్లకొడితే, నిన్నకాక మొన్న పార్టీ లోకి వచ్చిన మనకి అడ్డం లేకుండా పోతుంది.... భలే కదా.....
ReplyDelete