మూడో రోజుకు చేరుకున్న మాదిగల సంగ్రామ పాదయాత్ర

ఎంబిసి ప్రతినిధి యర్రగొండపాలెం : మూడో రోజుకు చేరుకున్న మాదిగల సంగ్రామ పాదయాత్ర.ఆదివారం యర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారికి సంఘీభావంగా యర్రగొండపాలెం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చేదూరి గంగయ్య మాదిగ వారితో కొంతమేర పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్  రాష్ట్ర అధికార ప్రతినిధి  త్రిపుర మాదిగ, ప్రకాశం జిల్లా ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ వినయ్ మాదిగ  మాట్లాడుతూ వర్గీకరణ చట్టబద్ధత కల్పించటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జూలై 2న సడక్ బంద్ జూలై 3న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మాదిగల అందరూ ఐక్యతగా పోరాడి జయప్రదం చేయాలని  వారు కోరారు.యర్రగొండపాలెం నుండి ప్రారంభమైన మూడవరోజు పాదయాత్ర సాయంత్రం మిట్టపాలెం చేరుకొని భోజనం అనంతరం విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం 9 గంటల సమయంలో త్రిపురాంతకం వైపుకు పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపాలెం ఎమ్మార్పీఎస్ యూత్ అచ్చిబాబు, మోషే, ఉప్పలపాటి యేసేబు, బాలు,కిస్మత్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments