అయిదు మండలాల్లో అధికారికంగా మేట్ల నియామకం ఎక్కడా ..
కేంద్ర ప్రభుత్వ నూతన హాజరు విధానం అంతా అవకతవకలకు అవకాశాలు..
ప్రతి గ్రామంలో పనికిరాకుండా ఆజరు నిధులు స్వాహా..
అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉన్నా ఫలితం ఏమిటి.
కందుకూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ జర జాగ్రత్తగా గమనిస్తే ఉపాధి హామీ పరాన్న జీవులకు ఉపాధితో పాటు బ్యాంకు బ్యాలెన్సులు పెంచేందుకు ఉపయోగపడుతుందనే ఆరోపణలు దండిగా వస్తున్నాయి గతంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం వల్ల హాజరు అంశంలో ఒకటీ రెండు ప్రాంతాల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నూతన ఎన్ఐసీ విధానం అమల్లో చేయటంతో అవకతవకలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విధానం ద్వారా ప్రతి రోజు హాజరు అందించేందుకు కొంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో స్థానిక ఫీల్డు టెక్నికల్ అసిస్టెంట్లు స్థానిక రాజకీయ నాయకులు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడుతూ నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల్లో అధికారికంగా మేట్ల నియామకం నిర్వహించాలని ఏపీడీ ఆదేశించినా అధికారికంగా ఏ ప్రాంతం నుండి ఏ మండలం నుండి పేర్లు రాలేదని సమాచారం తమ తమ గ్రామాల పరిధిలో నాయకులు ఎవరి పేర్లు చెప్తే వారికి హాజరు వేయటం నిధులు డ్రా చేయడం పరిపాటిగా మారిందనే అభిప్రాయాలు కు వస్తున్నాయి నిరంతరం జిల్లా అధికారులు స్థానిక అధికారులు పర్యవేక్షిస్తున్న రాజకీయం అడ్డుపడుతోందా అందువల్లనే అవకతవకలు యథేచ్ఛగా జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఉపాధిహామీ అవకతవకలపై అనేక విచారణలు జరిగాయి చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం అభియోగాలు ఆరోపణలు అవకతవకలు ప్రతిరోజూ వినిపిస్తున్నా ఏ ఒక్కరిపై చర్యలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆయా ప్రాంతాల్లోని నాయకుల కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలపై నిఖార్సయిన విచారణ జరిపి అవకతవకలకు ఎవరు బాధ్యులో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని అభిప్రాయాలు వస్తున్న నేటి రాజకీయాల్లో అలాంటి అభిప్రాయాలు వ్యక్తపరచటం కూడా అవివేకమే అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి ఏ గ్రామంలో ఉపాధిహామీ ఊసులు ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి గ్రామాల్లో వలసల నివారణకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం పక్కదారి పడుతుందన్న ఆవేదనతో నిత్యం వస్తున్న ఆరోపణలు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో కలానికి పదును పెట్టిన ఆ కాలం నుంచి వచ్చిన అక్షరాలా నగ్న సత్యాలను పట్టించుకునే వారు ఉంటే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది లేకపోతే అక్షర నగ్న సత్యాలు చిమ్మచీకటిలో మటుమాయం అయ్యే అవకాశం ఈ సమాజం గత కొన్ని దశాబ్దాలుగా అందిస్తున్న తరుణంలో మరో అవకతవకలు జరిగాయి అన్న విధంగానే నేటి సామాజిక పరిస్థితులు ఉన్నాయి అన్నది జగమెరిగిన సత్యం ఈ సత్యంలో అక్షర నగ్నసత్యాలు ఒక మూలకు ఒదిగిపోవటమే కాలం నేర్పిన నగ్న సత్యం.
1 Comments
కొండముడుసు పాలెం లో allotment చేసిన పని ఒకటి కాని చేసే పని ఒకటి చెరువు నిండా నీళ్లు ఉంటాయి కాని చెరువులో పని చేస్తున్నాం అని అధికారులు చెప్తారు
ReplyDelete