కందుకూరు నియోజకవర్గంలో టిడిపి లో అసలు ఏమి జరుగుతోంది..
అధికార వైసీపీలో ఎమ్మెల్యే మహీధర రెడ్డి ఎమ్మెల్సీ మాధవరావుతో బలంగా దూసుకుపోతున్న వైసీపీ..
టిడిపిలో మూడుముక్కలాట..
పార్టీ కష్టకాలంలో ముందుకు వచ్చిన ఇంటూరి రాజేష్..
నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు అండదండలు..
పంచాయతీ ఎన్నికల్లో ఆర్థిక చేయూత అందించిన రాజేష్..
మూడు దశాబ్దాల రాజకీయాలు మార్పులేని శివరాం..
ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తున్నారు ఎవరిని దించుతారు తెలియక టిడిపి కార్యకర్తల అయోమయం..
సంక్రాంతి తదుపరి పార్టీ బలోపేతంపై ఆది స్థానందృష్టి..
సంక్రాంతి తదుపరి కోఆర్డినేటర్ నియామకం..
అవకాశాలు దండిగా ఉన్న రాజేష్..
కందుకూరు నియోజకవర్గంలో పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం జెండా మోసేందుకు ఎన్ని కష్టనష్టాలు భరించడానికి కైనా సిద్ధంగా ఉండే కార్యకర్తల బలం కందుకూరు సొంతం అలాంటి కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సామాన్య టిడిపి కార్యకర్తలు నిరంతరం మానసిక వేదన చెందుతున్న పరిస్థితి ఉంది. కందుకూరు నియోజకవర్గంలో ఆదినుంచి దివివి మానుగుంటకుటుంబాల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా ఎప్పుడు పోటాపోటీగా కొనసాగింది. శాసనసభ్యులు మానుగుంట మహీధర రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గా పదవి అనేకమార్లు అధిరోహించి ప్రజల మన్ననలు పొందారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తండ్రి బీబీ కొండయ్యచౌదరి ఎమ్మెల్యేగా శాసనసభ స్పీకర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ పదవికే వన్నె తీసుకు వచ్చారు .గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు చేపట్టి అపర రాజకీయానికి మహీధర్‌రెడ్డి పేరు గడించారుప్రస్తుతం వైసిపి నాయకులు గా ఎమ్మెల్యేగామానుగుంట మహీధర రెడ్డి కొనసాగుతున్నారు. తెలుగుదేశం నాయకులు కొండయ్య కుమారుడు గా డాక్టర్ దివి శివరాంరాజకీయాల్లోకి వచ్చి మూడు దశాబ్దాలపాటు వైరి వర్గాలుగా పోటీ పడ్డారు. మహీధర రెడ్డి రాజకీయ చతురతతో ఎప్పుడు పైచేయి సాధిస్తారు బోలా శంకరుడు గా పేరు గడించిన శివరాం కోపంతో తన అభిమానులు కూడా కొన్ని సమయాల్లో దూరం చేర్చుకున్నాడు .ఈ సందర్భంగా రెండు సార్లు దివి శివరాం మూడు సార్లు మహీధర రెడ్డి ఎన్నికల్లో విజేతలు గా గెలుపొందారుఈ క్రమంలో 2014వ సంవత్సరంలో కందుకూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గాగెలుపొందిన పోతుల రామారావు టిడిపిలో చేరటంతో రాజకీయాల్లో మార్పు వచ్చాయి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోతుల రామారావు వైసీపీ అభ్యర్థిగా మహీధరరెడ్డి పోటీపడగా మహీధరరెడ్డి విజయం సాధించారు. అనంతరం మహీధర్‌రెడ్డి మార్కు రాజకీయాలలో భాగంగా కందుకూర్ లో బలమైన టిడిపి బలహీన పడటం జరుగుతుంది జరిగింది ఈ క్రమంలో అధిక శాతం టీడీపీ నాయకులు వైసీపీలో చేరిన కార్యకర్తలు మాత్రం పార్టీ జెండాలు సేదతీరుతూ ఉన్నారు. కందుకూరు నియోజకవర్గంలో పార్టీ కోసం ముఖ్యంగా టిడిపిని బలోపేతం చేసేందుకు రెండు సంవత్సరాలపాటు ఎవరు ముందుకు రాలేదు .ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలను ఎస్సీ బిసి వర్గాలకు చెందిన నాయకులు తమ భుజంపై వేసుకొని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో పోతుల రామారావు పైఅధికారపక్ష కచ్చ సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని విమర్శలు వచ్చాయి. తదుపరి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కొంతకాలం ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఆరోగ్యం కుదుట పడడంతో ప్రస్తుతం కనిపిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని బడేవారి పాలెం గ్రామానికి చెందిన ఇంటూరిరాజేష్ నేనున్నానని పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండదండగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా దెబ్బ తిన్న కార్యకర్తలకు చేయూత అందించడంతోపాటు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక చేయూత అందించారుముఖ్యంగా అమరావతి రైతుల పాదయాత్ర కందుకూరు నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంలో కార్యక్రమం విజయవంతానికి మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మండలానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాలని ఆదేశించగా రాజేష్ విరాళాలు సేకరించడం ఖర్చు తాను భరిస్తానని నాయకులు కార్యకర్తలకు హామీ ఇచ్చి రైతుల పాదయాత్ర నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగేలా పార్టీ కార్యకర్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మూడు దశాబ్దాల తన రాజకీయ మార్పు లేదని రాజేష్ ను దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు సమాచారం ఇంతవరకు రామారావు ను కాదని ఇంచార్జి ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ కోసం నిరంతరం ముందుంటానని రామారావుకు ఇంచార్జి అందిస్తే ఆయన నా విజయానికి కృషి చేస్తాననిచంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమని పదే పదే రాజేష్ పేర్కొంటున్నారు ఇదే సందర్భంలో రామారావు కాకుండా ఎవరికైనా ఇచ్చిన సందర్భంలో తన పేరును పరిశీలించాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో బడేవారి పాలెం చెందిన ఇంటూరి నాగేశ్వరరావు రావడంతో పార్టీలో మరోసారి విభేదాలు బహిర్గతం అవుతున్నాయని టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు యువకుడు పార్టీ అంటే అభిమానం అన్ని పుష్కలంగా ఉన్నా ముందునుంచి రాజేష్ పార్టీ కార్యక్రమాల్లో ఉండటంతో ఇరువురు మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఈ అంశంపై అధిష్టానం వద్దకు వెళ్ళగా సంక్రాంతి తదుపరి కోఆర్డినేటర్ నియమిస్తామనిరాజేష్ కు హామీ ఇచ్చినట్లు సమాచారం మరోవైపు ఎప్పుడు జరుగుతాయో తెలియని మున్సిపల్ ఎన్నికల కోసం మాజీ ఎమ్మెల్యే తాపత్రయ పడుతున్నార నీ సమాచార .టీడీపీ ప్రత్యర్థి అయిన అధికార వైసిపి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే మహీధర రెడ్డి నీ ఎదుర్కోవటం అంత సులువైన అంశం కాదు ఆపరా రాజకీయ నాయకుడిగా పేరు గడించి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అండదండలు పుష్కలంగా ఉన్న ఆయన ఎదుర్కోవాలంటే టిడిపి నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పార్టీ బలోపేతానికి ముందుకుసాగి ఎదుర్కొంటే సాధ్యం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఎదుర్కోవటం లేదా వైసీపీ ఎదుర్కోవాలంటే పార్టీకి మొత్తం సమైక్యంగా ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ అంశాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో సంక్రాంతి తదుపరిపార్టీ అంతర్గత కలహాలు అధిష్టానం పరిష్కరించే అవకాశం ఎంతైనా ఉంది ఇదే సమయంలో కోఆర్డినేటర్లు నియమించటం తప్పదనేసమాచారం ఇదే సమయంలో రామారావు పార్టీ బాధ్యతలు చూసుకుంటే ఆయనను తప్పించి మరొకరికి ఇచ్చే అవకాశం కూడా లేదని విశ్లేషణలు ఉన్నాయి ఏదేమైనా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎవరూ ముందుకు రాని సమయంలో రాజేష్ ముందుకు వచ్చిన క్రమంలో ఆయన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు మరోవైపు తన రాజకీయాల కొనసాగింపు లో మాజీ ఎమ్మెల్యే మార్పులు చేసుకుంటే మరింత మంచిదని అభిప్రాయం ఉంది బోలా శంకరుడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరిని ఎప్పుడూ పై కి ఎక్కిస్తారుదూరంగా పెడతారో మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ క్రమంలో అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ఒక్కతాటిపై తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభిస్తే నియోజకవర్గంలో టిడిపి ముందుకు దూసుకుపోతుంది లేదా గత రెండు ఎన్నికల్లో మాధురి మరల పడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
3 Comments
మంచి విశ్లేషణ
ReplyDeleteJai tdp
ReplyDeleteJai INR
ReplyDelete