ఒంగోలు యం బి సి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు చైతన్య రధ సారధి మాజీ మంత్రి, నందమూరి హరికృష్ణ వర్ధంతి కార్యక్రమం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు అన్న నందమూరి తారకరామారావు తోడుగా రాష్ట్రం నలుమూలల చైతన్య రథసారథిగా ఎన్నో లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసి తండ్రికి చేదోడు వాదోడుగా అన్నీ తానై చూసుకుంటూ రాష్ట్రంలోని ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అన్న హరికృష్ణ గా పిలవబడ్డాడు తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివి అని ఆయన సేవలను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మరువ దని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేయాలని అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు.
0 Comments